పోలీస్ ట్రైనింగ్‌లో మరో అపశ్రుతి‍‍-ఆగిన యువతి గుండె

తెలంగాణలో జరుగుతున్న పోలీస్ ట్రైనింగ్‌లో మరో అపశ్రుతి జరిగింది. కరీంనగర్‌లోని పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్లో నిర్వహించిన పరుగు పందెంలో యువతి ప్రాణాలు కోల్పోయింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్young women dies during police selections జిల్లా రామడుగు మండలం వెలిశాల గ్రామానికి చెందిన వి. మమత(20) సోమవారం పోలీస్‌ దేహదారుఢ్య పరీక్షలకు హాజరైంది. దీనిలో భాగంగా అభ్యర్థులకు 100మీటర్ల పరుగు పందెం నిర్వహించారు. ఈ పందెంలో ఉత్సాహంగా పాల్గొన్న మమత కొద్ది క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. అక్కడే అందుబాటులో ఉన్న డాక్టర్లు ఆమెకు ప్రాథమిక చికిత్స అందజేసి అనంతరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

అయితే మమత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మెరుగైన చికిత్స అందించినా ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు తెలిపారు. విషయం తెలుసుకున్న కరీంనగర్‌ పోలీస్ కమిషనర్‌ బి. కమల్‌హసన్‌ రెడ్డి వెంటనే ఆస్పత్రికి చేరుకుని మమత మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె కుటుంబసభ్యులను పరామర్శించారు. వైద్య పరంగా అన్ని సహకారాలూ అందించామని, ప్రభుత్వ సాయం అందేలా ప్రయత్నిస్తామని తెలిపారు. అభ్యర్థులకు ఆరోగ్య సమస్యలు ఉంటే ముందే తెలపాలని కమిషనర్ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *