మీరే నిజమైన హీరో.. సానియా మీర్జా దేశభక్తి

వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్.. భారత గడ్డపై తిరిగి కాలుమోపడంపై టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాస్పందించారు. మీరే మా నిజమైన హీరో అంటూ ఆమె ఓ ట్వీట్ చేశారు. పుల్వామా ఘటన తదంనతర పరిణామాలపై సానియా మీర్జా స్పందించకపోవడం పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అభినందన్‌ను ఉద్దేశించి ఆమె ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

‘మీరు ప్రదర్శించిన ధైర్యానికి, మీ హుందాతనానికి దేశం సెల్యూట్ చేస్తోంది.. మీరు మా నిజమైన హీరో..’ అని అభినందన్‌ను ఉద్దేశించి సానియా పేర్కొన్నారు. ‘అభినందన్‌కు స్వాగతం..’ అంటూ ఆమె ట్వీట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *