బంగారం ధర ఢమాల్.. ఎంత తగ్గిందో తెలుసా?

బంగారం ధర మంగళవారం క్షీణించింది. దేశీ మార్కెట్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.320 తగ్గుదలతో రూ.33,450కు క్షీణించింది. దేశీ జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ తగ్గడం సహా అంతర్జాతీయ ట్రెండ్ బలహీనంగా ఉండటం ఇందుకు కారణం. బంగారం ధర గత మూడు రోజుల్లో ఏకంగా రూ.880 తగ్గింది.

బంగారం ధర బాటలోనే వెండి ధరలు కూడా నడిచాయి. కేజీ వెండి ధర రూ.450 తగ్గుదలతో రూ.39,500కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, వెండి నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు కారణం. ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లకు అధిక ప్రధాన్యమిస్తుండటం కూడా బంగారంపై ప్రతికూల ప్రభావం చూపింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.06 శాతం క్షీణతతో 1,286.65 డాలర్లకు తగ్గింది. అయితే వెండి ధర ఔన్స్‌కు 0.12 శాతం పెరుగుదలతో 15.17 డాలర్లకు పెరిగింది. సోమవారం మహాశివరాత్రి సందర్భంగా బులియన్ మార్కెట్‌కు సెలవు.
ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.320 తగ్గుదలతో రూ.33,450కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.320 తగ్గుదలతో రూ.33,300కు క్షీణించింది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గుదలతో రూ.26,400కు క్షీణించింది.కేజీ వెండి ధర రూ.450 తగ్గుదలతో రూ.39,500లకు క్షీణిస్తే.. వారాంతపు ఆధారిత డెలివరీ ధర రూ.185 తగ్గుదలతో రూ.38,115కు దిగొచ్చింది. ఇక 100 వెండి నాణేల కొనుగోలు, అమ్మకం విషయానికి వస్తే.. కొనుగోలు ధర రూ.80,000కు, అమ్మకం ధర రూ.81,000కు తగ్గింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *