పుల్వామా దాడి ఒక భయంకరమైన పరిస్థితి-ట్రంప్

పుల్వామా ఆత్మాహుతి దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ ఉగ్రదాడిని భయంకరమైన పరిస్థితి అంటూ ఇటీవల ఆయన‌ ఓ ప్రకటన విడుదల చేశారు. అలాగే ప్రత్యేకంగా భారత్‌కు పూర్తి మద్దతు ప్రకటించిన అమెరికా రక్షణ శాఖ డిప్యూటీ అధికారప్రతినిధి రాబర్ట్ పల్లాడినో, ఫిబ్రవరి 14 ఉగ్రదాడికి కారణమైన వారు ఎవరైనా పాకిస్థాన్ శిక్షించాల్సిందేనని డిమాండ్ చేశారు. పుల్వామా ఉగ్రదాడితో భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రికత్తలు చోటుచేసుకున్న తరుణంలో ట్రంప్ స్పందిస్తూ.. ఒకవేళ ఈ రెండు దక్షిణాసియా దేశాలు కలిస్తే అద్భుతమే అవుతుందని వ్యాఖ్యానించారు. ‘ఫిబ్రవరి 14 దాడి తర్వాత భారత్, పాక్‌ల మధ్య నెలకొన్న పరిస్థితులను గమనిస్తున్నానని, దీనిపై పలు నివేదికలను కూడా సేకరించాను.. దీనిపై సరైన సమయంలోనే వ్యాఖ్యానిస్తున్నారు.. ఒకవేళ ఈ రెండు దేశాలు కలిసి పనిచేస్తే అద్భుతాలు జరుగుతాయి’ మీడియా అడిగి ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అయితే, ఆత్మాహుతి దాడి భయంకరమైన పరిస్థితి అని, దీనిపై తమకు నివేదిక ఉందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *