‘మహానాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

తెలుగు అగ్రహీరోల్లో ఒకరైన నందమూరి బాలకృష్ణ కెరీర్లో సూపర్‌హిట్లతో పాటు ప్లాపులు, డిజాస్టర్లు కూడా ఉన్నాయి. అయితే తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్‌ మాత్రం బాలయ్యకు కెరీర్లో మరిచిపోలేని గుణపాఠం చెప్పింది. తొలి భాగం ‘కథానాయకుడు’ డిజాస్టర్‌గా నిలవగా.. శుక్రవారం(ఫిబ్రవరి 22) విడుదలైన ‘మహానాయకుడు’ కూడా అదే దిశగా పయనిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లే అందుకు నిదర్శనం.

చిన్న చిన్న హీరోల సినిమాలే తొలిరోజు 2-3 కోట్ల రూపాయలు రాబడుతున్న ఈ కాలంలో ‘మహానాయకుడు’ ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో కేవలం రూ.కోటి మాత్రమే వసూలు చేయడంపై చిత్ర యూనిట్ షాక్‌కు గురైంది. వర్మ డిజాస్టర్ మూవీ ‘ఆఫీసర్’ తొలిరోజు ఇంతకంటే ఎక్కువే రాబట్టినట్లు ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. ‘కథానాయకుడు’ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాకపోవడం యూనిట్‌ను నిరాశపరిచింది. దీంతో ‘మహానాయకుడు’ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన క్రిష్, బాలయ్య.. ఎన్నో అంచనాలతో విడుదల చేశారు. అయితే ఫలితం మాత్రం మారలేదు. శని, ఆదివారాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగితే బాలయ్య సినీ కెరీర్లోనే ఇదో పెద్ద డిజాస్టర్‌గా నిలవడం ఖాయం అంటూ ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వర్మ ‘ఆఫీసర్’ ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో తొలిరోజు రూ.3.44 లక్షలు వసూలు చేస్తే.. ‘మహానాయకుడు’ కేవలం రూ.1.60లక్షలు మాత్రమే వసూలు చేయడాన్ని బట్టే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు. ‘మహానాయకుడు’ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న యూనిట్‌కు ఈ కలెక్షన్లు మింగుడుపడటం లేదు. ‘కథానాయకుడు’తో తీవ్రంగా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు ‘మహానాయకుడు’తో మరింత మునిగిపోయే సూచనలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *