ఇండియాలో ఆడవాళ్లకు గౌరవం లేదు-నాగబాబు

ఇండియాలో ఆడవాళ్లకు గౌరవం లేదని అన్నారు సినీనటుడు నాగబాబు తెలిపారు.సమాజంలో ఆడదాన్ని అణగదొక్కాలనే ప్రతి మగాడు చూస్తాడన్నారు. ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఆడవాళ్లు ఏం బట్టలు వేసుకోవాలో చెప్పడానికి ఎవరికీ అర్హత లేదని తెలిపారు.

ఇటీవల ‘మహిళల వస్త్రధారణపై ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, మురళీమోహన్, గరికపాటి లాంటి వాళ్లు ఎన్నో కామెంట్లు చేశారు. ఓ మహిళను మనతో సమానంగా చూసుకోలేనప్పుడు ఆమెను మనం గౌరవించలేం. అందుకే డామినేట్ చేయడానికి ప్రయత్నిస్తాం. అడవాళ్లంటే అసలు గౌరవం ఉందా? ఫంక్షన్లకు హీరోయిన్లేమైనా బట్టలిప్పుకుని వస్తున్నారా? హీరోయిన్ల గురించి మాట్లాడేందుకు వాళ్లకేం అర్హత ఉంది?. పొట్టి దుస్తులు వేసుకుంటే వాళ్లకి కేరెక్టర్ లేనట్లేగా? అని నాగబాబు మండిపడ్డారు.

సెలబ్రెటీలుగా ఆడవాళ్లపై అలాంటి వ్యాఖ్యలు చేస్తే నాగబాబు కూడా సెలబ్రెటీగా వ్యాఖ్యలు చేస్తున్నాను అన్నారు . ఆడవాళ్ల డ్రెస్సింగ్‌ను విమర్శించే హక్కు ఎవరికీ లేదు.వాళ్లు కురచ దుస్తులు వేసుకున్నారని, ఎక్స్‌పోజింగ్ చేస్తున్నారంటూ విమర్శంచే అధికారం ఎవరికీ లేదన్నారు. ఆడవాళ్లను ఏమాత్రం గౌరవించని దేశం మనది. మగాళ్లు ఎలా ఉన్నా ఆడపిల్లలు విమర్శించడం లేదు. అలాంటప్పుడు మహిళల గురించి మనం ఎందుకు మాట్లాడాలి.నేను ఓ మహిళకు బిడ్డను, ఓ మహిళకు భర్తని, ఓ ఆడపిల్లకి తండ్రిని.. నాకు పరిచయం ఉన్న ఎందరో ఆడవాళ్లని ఆడపడుచులుగా భావిస్తుంటా. మన సమాజంలో మగ, ఆడ ఇద్దరికీ సమానహక్కులు, గౌరవం ఉండాలన్నదే నా అభిప్రాయం. అందుకే ఈ విషయంలో అంత సీరియస్‌గా స్పందించాల్సి వచ్చింది’ అని చెప్పుకొచ్చారు నాగబాబు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *