KTR: ‘కేజీఎఫ్’ సూపర్బ్ .. ‘యష్’ నటనకు ఫిదా

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించాక.. రాజకీయాల్లో బాగా బిజీ అయ్యారు కేటీఆర్. కాస్త తీరిక దొరికిన సమయంలో నెటిజన్లతో ముచ్చటిస్తూ.. తన అభిప్రాయాలను వారితో పంచుకుంటున్నారు. తాజాగా కేటీఆర్ కేజీఎఫ్ మూవీ చూశారట.. సినిమా అదిరిపోయిందంటూ ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశారు.

కేటీఆర్ తన ట్వీట్‌లో ‘కొద్దిగా ఆల‌స్యంగా అయినా.. చివరికి `కేజీఎఫ్‌` చూశాను. సినిమా అద్భుతంగా ఉంది.. సాంకేతికంగా, కథాపరంగా ఆకట్టుకుంది. కథను ఉత్కంఠంగా చూపించారు.. మరోపక్క కూల్‌గానూ అనిపించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం, స్క్రీన్ ప్లే ఆకట్టుకుంది.. బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. స్క్రీన్‌ఫై రాక్‌స్టార్ య‌ష్ నటన అదరిపోయింది’అని ప్రశంసలు కురిపించారు.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *