వాళ్లను చంపేయాలి అంటూ మోదీకి 4వ తరగతి బాలిక లేఖ

Image result for modi
*మోదీ గారూ.. మీపై నాకు నమ్మకం ఉంది.
*పుల్వామా దాడిపై ప్రతీకారం తీర్చుకోవాలి.
*ఉగ్రవాదులను ఒక్కొక్కడిని కాల్చి చంపాలి.
*దుర్మార్గులను చంపడం పాపం కాదని గీతలోనూ చెప్పారు.
*మోదీకి సూరత్ బాలిక రాసిన లేఖ వైరల్.

పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది జవాన్లను కోల్పోయి దేశం కంటతడి పెడుతోంది. దాయాది దేశంపై యావత్ దేశం రగిలిపోతోంది. పాక్‌పై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని భారతీయులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని మండిపడుతున్నారు. అమర జవాన్లకు సంబంధించిన వివరాలు తెలుసుకుంటూ అందరూ బరువెక్కిన హృదయాలతో నివాళి అర్పిస్తున్నారు. ఈ సమయంలో సూరత్‌లో నాలుగో తరగతి చదువుతున్న ఓ బాలిక మరో అడుగు ముందుకేసి.. ప్రధాని మోదీకి లేఖ రాసింది.

పుల్వామా ముష్కర దాడి గుజరాత్‌లోని సూరత్‌ జిల్లాకు చెందిన ఓ బాలికను తీవ్రంగా కలచివేసింది. పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలంటూ ప్రధాని మోదీకి లేఖ రాసింది. దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఒక్కొక్కరినీ కాల్చి చంపాలని కోరింది. సూరత్ జిల్లా పూనాకు చెందిన మనాలీ అనే ఈ పాప రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గీతలోనూ అదే చెప్పారు..
దుర్మార్గులను చంపడం తప్పేమీ కాదని భవద్గీతలోనూ చెప్పినట్లు మనాలి గుర్తుచేసింది. ‘మోదీ గారు.. మీపై నమ్మకం ఉంది. మీరు ఏది చేసినా మంచే చేస్తారు. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఒక్కొక్కడిని కాల్చి చంపేయాలి. అలాంటి వాళ్లను చంపడం పాపం కాదని గీతలో కూడా చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *