150 డ్రోన్లతో వినూత్నంగా ‘బ్రహ్మాస్త్ర’ లోగో లాంచ్‌

రణ్‌బీర్ క‌పూర్‌, అలియా భ‌ట్ జంట‌గా ధ‌ర్మ ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్‌పై అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శక‌త్వంలో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. హీరూ జోహార్‌, అపూర్వ మెహ‌తా, ఆసిమ్ జ‌బాజ్‌, గులాబ్ సింగ్ త‌న్వర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అమితాబ్ బ‌చ్చన్‌, టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ సినిమా లోగోను ఉత్తర‌ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ కుంభ‌మేళాలో వినూత్నంగా విడుద‌ల చేశారు. ఈ లోగో విడుద‌ల కార్యక్రమంలో భాగంగా రణ్‌బీర్ కపూర్‌, అలియా భ‌ట్‌, ద‌ర్శకుడు అయాన్ ముఖ‌ర్జీ ప్రయాగ‌కు వెళ్లారు. 150 డ్రోన్ కెమెరాల స‌హాయంతో ‘బ్రహ్మాస్త్ర’ అనే లోగోను ఆకాశంలో ఆవిష్కరించడం విశేషం. ఇలా డ్రోన్స్ స‌హాయంతో ఆకాశంలో లోగోను ఆవిష్కరించ‌డం సినిమా చరిత్రలో ఇదే మొద‌టిసారి. ఇలా గ్రాండ్‌గా విడుద‌ల చేసిన ‘బ్రహ్మాస్త్ర’ లోగో అక్కడకు వ‌చ్చిన వారంద‌రినీ ఆక‌ట్టుకుంది.

‘బ్రహ్మాస్త్ర’ సిరీస్‌లో మూడు భాగాలుంటాయి. అందులో మొద‌టి భాగాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ఈ ఏడాది డిసెంబ‌ర్ 25 హిందీతో పాటు తెలుగు, త‌మిళ‌, మ‌లయాళ భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నారు ద‌ర్శక నిర్మాత‌లు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *