BJP వెబ్‌సైట్ హ్యాక్:మోదీపై వ్యంగ్య పోస్టులు

బీజేపీ వెబ్‌సైట్ హ్యాకింగ్‌కు గురైంది. ప్రధాని మోదీని కించపరుస్తూ హ్యాకర్లు మీమ్స్ పోస్టు చేశారు. క్షణాల్లోనే వైరల్‌గా మారింది. భారతీయ జనతా పార్టీకి చెందిన వెబ్‌సైట్‌ను హ్యాక్ చేశారంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ప్రధాని మోదీపై మీమ్స్‌ను పోస్ట్ చేశారని తెలిపిన యూజర్లు.. వాటి స్క్రీన్‌షాట్లను బయటపెట్టారు.

ప్రధాని నరేంద్ర మోదీపై సెటైర్ల వేస్తూ హ్యాకర్లు మీమ్స్ పోస్టు చేశారు. సదరు మీమ్‌లో జర్మనీ ఛాన్స్‌లర్ ఏంజెలా మెర్కల్‌తో ప్రధాని మోదీ కరచాలనం చేయడానికి ప్రయత్నిస్తుండగా.. ఆమె దూరంగా జరుగుతున్నారు.

‘సోదర సోదరీమణులారా.. నేను మిమ్మల్నందరినీ ఫూల్‌ చేశా.. మేమందరం మిమ్మల్ని ఫూల్స్ చేశాం. ఇంకా ఇలాంటివి చాలా రానున్నాయి. కంగ్రాట్స్..’ అంటూ మోదీ అన్నట్లుగా ఈ మీమ్స్ పోస్ట్ చేశారు. తమ వెబ్‌సైట్ హ్యాకింగ్‌కు గురైన అంశాన్ని బీజేపీ ధ్రువీకరించాల్సి ఉంది. హ్యాకింగ్ చేసినట్లుగా ఇప్పటివరకూ ఏ సంస్థ క్లెయిమ్ చేసుకోలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *