జపాన్ కి వెళ్తున్న ప్రభాస్, అనుష్క.. ఏం జరుగుతోంది!

ప్రభాస్, అనుష్క ఏం చేసినా.. వార్తల్లో నిత్యం నిలుస్తున్నారు. ప్రభాస్, అనుష్క ప్రేమించుకుంటున్నారని, త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నారని పదే పదే రూమర్లు రావడం. తాజాగా అలాంటి ఓ వార్త వైరల్‌గా మారింది. అదేమిటంటే.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, స్వీటీ అనుష్క శెట్టి.. ఇద్దరూ కలిసి జపాన్‌కు వెళ్తున్నారట. ఈ ప్రత్యేక ప్రయాణం వెనుక రహస్యం ఏమిటనే చర్చ హాట్ టాపిక్‌గా మారింది.

బాహుబలి సినిమా కోసం సుమారు ఐదేళ్ల పాటు కలిసి పనిచేయడం వల్ల ప్రభాస్, అనుష్క మధ్య రూమర్లు అనేకం వచ్చాయి. వారి మధ్య అత్యంత సన్నిహితమైన స్నేహ బంధం ఉందని.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. అలాంటిదేమీ లేదని అటు ప్రభాస్, ఇటు అనుష్క ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు.

కరణ్ జోహార్ నిర్వహిస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ రియాల్టీ షోలో ఇటీవల దర్శకుడు రాజమౌళి, దగ్గుబాటి రానాతో కలిసి పాల్గొన్న ప్రభాస్.. అనుష్కతో తన పెళ్లి వార్తలపై స్పందించారు. అవి రూమర్లేనని, అందులో ఎలాంటి వాస్తవం లేదని వివరణ ఇచ్చారు.

‘ఒక హీరో, హీరోయిన్ కలిసి ఒకటి కంటే ఎక్కువ సినిమాలు చేస్తే.. రూమర్లు అంటగట్టేస్తారు. అనుష్కతో కలిసి నేను ఇప్పటికే 3 సినిమాలు చేశా. అందులోనూ బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: కన్‌క్లూజన్ సినిమాల కోసం చాలా కాలం పనిచేశాం. ఇక మాపై అలాంటి రూమర్లు రావడం వింతేమీ కాదు. ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. కావాలంటే రాజమౌళి సర్‌ని అడగండి’ అని ప్రభాస్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *