ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క‌ కీలక సమాచారం చోరీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క‌ కీలక సమాచారం చోరీ అయినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలు చోరీ. ఈ మేరకు వైసీపీ నేత విజయసాయిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. కూకట్ పల్లిలో ఉన్న బ్లూ ఫ్రాగ్ మొబైల్స్ టెక్నాలజీ కంపెనీలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలు, ఓటర్ కార్డులు, ఆధార్ కార్డులు ఆ సంస్థలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ సంస్థకు చెందిన రెండు ప్రధాన కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *