అభినందన్‌ సేఫ్‌గా ఉన్నారు: పాక్

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన అభినందన్‌ను అదుపులోకి తీసుకున్న వ్యవహారంపై పాక్ స్పందించింది. అభినందన్ సురక్షితంగా ఉన్నారని పాకిస్తాన్ దేశ విదేశాంగ ప్రతినిధి డాక్టర్ మహ్మద్ పైజల్ ప్రకటించారు. ఆయనకు ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేశారు.అభినందన్‌ విడుదలకు సంబంధించి భారత్‌ తమతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు.

అభినందన్ విషయంపై కొద్దిరోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ఫైజల్ తెలిపారు. అతడిని యుద్ధ ఖైదీగా పరిగణించాలా? వద్దా? అన్న అంశంపై పాక్ ప్రభుత్వం సమాలోచనలు చేస్తోందన్నారు. అభినందన్‌ను చిత్రహింసలు పెడుతున్నట్లు భారత్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని పేర్కొన్నారు.

పాకిస్థాన్‌కు బందీగా చిక్కిన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను చిత్రహింసలకు గురిచేస్తున్నారంటూ భారత రక్షణ శాఖ కీలక ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. పాక్ సైన్యం జెనీవా ఒప్పందానికి తూట్లు పొడిచి యుద్ధ ఖైదీని తీవ్రంగా హింసిస్తోందని ఆరోపించింది. ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌కు పాక్ పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ప్రపంచ దేశాలను తప్పుదోవ పట్టిస్తోందని భారత్ ఆరోపించింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *