శ్రీ ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది …….

మరింత విషమంగా ఎస్పీ బాలు ఆరోగ్యం.. ECMO సపోర్ట్‌తో చికిత్స.. రజనీ, కమల్ ప్రార్థనలు ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి మరింత విషమించిందనే విషయంగా ఆందోళనగా మారింది. కరోనా వ్యాధితో ఎస్పీ బాలు చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా బాలు ఆరోగ్య పరిస్థితి గురించి హెల్త్ బులెటిన్ ను విడుదల చేసింది. బాలు ఆరోగ్య పరిస్థితి విషమిస్తున్నది. ఐసీయూలో ఎక్మో సపోర్ట్‌తో చావు బతుకులతో పోరాడుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఈసీఎంవో ద్వారా చికిత్స తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం..

శ్రీ ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఆయనకు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నాం. ఎక్స్‌ట్రా కార్పోరియల్ మెంబ్రేన్స్ ఆక్సిజన్ (ఈసీఎంవో) సపోర్టు ద్వారా ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయన కీలక అవయవాల పనితీరును వైద్యుల బృందంగా నిశితంగా పర్యవేక్షిస్తున్నది. అయితే బాలు చికిత్సకు స్పందించడం పట్ల వైద్యులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు అని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రార్థనలు ఎస్పీ బాలు ఆరోగ్యం మెరుగుపడాలని ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో సాముహిక ప్రార్థనలు చేస్తున్నారు.

రెండు రోజుల క్రితం తెలుగు సినీ మ్యూజిక్ అసోసియేషన్ సామూహిక ప్రార్థనలు చేశారు. ఆయన ఆరోగ్యం కుదుట పడాలని భగవంతుడిని వేడుకొన్నారు. కమల్, రజనీ ప్రముఖుల తమిళ చిత్ర పరిశ్రమ ప్రముఖులు కూడా గురువారం సామూహిక ప్రార్థనలు చేపట్టనున్నారు. కమల్ హాసన్, రజనీకాంత్, ఇళయరాజా, ఏఆర్ రెహ్మన్, ఇతర ప్రముఖులు బాలు ఆరోగ్యం మెరుగుపడాలని ప్రార్థించారు. గురువారం సాయంత్రం 6 గంటలకు జరిగే ప్రార్థనలో పాల్గొనాలని భారతీరాజా, వైరముత్తు, జీవీ ప్రకాశ్, కార్తీ, ఏఆర్ మురుగదాస్ పిలుపునిచ్చారు. ఆగస్టు 5 తేదీన హాస్పిటల్‌లో చేరిక ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చేరారు. కరోనా వైరస్ సోకగానే స్వయంగా వీడియో రిలీజ్ చేసి వెల్లడించారు. అభిమానులు ఆందోళనకు గురికావోద్దని, తాను సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తానని వీడియోలో వెల్లడించడం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *