మూడు రాజధానులు ….. హైకోర్టు ఎం తీర్పు ఇస్తది ??

‘మా మానాన మమ్మల్ని బతకనివ్వండి’అని అక్కడ ప్రజలు మొత్తుకుంటున్నారన్నారు రఘురామ. ఇప్పుడు విశాఖ వెళ్లి మేం అభివృద్ధి చేస్తామనడం జంధ్యాల, ఈవీవీ, భట్టాచార్య సినిమాలను మించిన కామెడీ చేసినట్టుగా ఉంటుందన్నారు.

వైసీపీ ఎంపీ ఏపీ రాజధాని అంశంపై ఎంపీ రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధానిని నిర్ణయించే హక్కు ఆయా రాష్ట్రాలకే ఉందని కేంద్రం అఫిడవిట్‌లో చెప్పడం బాధ కలిగించిందన్నారు. అఫిడవిట్‌తో కంగారుపడాల్సిన అవసరం లేదని.. తప్పకుండా న్యాయం జరుగుతందని వ్యాఖ్యానించారు. తరలించడానికి వీల్లేని హైకోర్టును కర్నూలులో పెడతామంటున్నారని.. దీనికి అభివృద్ధి వికేంద్రీకరణ అని పేరు పెట్టారని.. అభివృద్ధి కేంద్రీకరణ అని చెబితే బాగుంటుందన్నారు.

అమరావతి నుంచి రాజధానిని ఎందుకు మార్చాలని భావిస్తున్నారో చెప్పేందుకు అభివృద్ధి వికేంద్రీకరణ అనే టైటిల్ పెట్టారని ఎంపీ వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలో లేనిది ఏంటి.. దేశంలోనే అత్యంత పెద్ద స్టీల్ ప్లాంట్ ఇక్కడే ఉందన్నారు. ప్రధాన పోర్టుల్లో ఒకటైన విశాఖ పోర్టు దేశంలోనే అత్యధిక ఎగుమతులు జరుపుతోందన్నారు.

గంగవరం పోర్టు కూడా దరిదాపుల్లోనే ఉందని.. విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్ పోర్టు సైతం సమీపంలోనే వస్తోందని గుర్తు చేశారు. శ్రీకాకుళంలో చాలా పరిశ్రమలు ఉన్నాయన్నారు. విజయసాయిరెడ్డి గారి బంధువులకు చెందిన ఫార్మా సంస్థ కూడా అక్కడే ఉంది. విశాఖలో ఐదు వందల ఎకరాల్లో హెటెరో డ్రగ్స్ సంస్థ ఉంది. అభివృద్ధి చెందిన ప్రాంతాలను చెడగొట్టదన్నారు. ఎంతో అభివృద్ధి చెందిన విశాఖను అభివృద్ధి చేస్తామనడం కామెడీగా ఉందన్నారు.

‘మా మానాన మమ్మల్ని బతకనివ్వండి’అని అక్కడ ప్రజలు మొత్తుకుంటున్నారన్నారు రఘురామ. ఇప్పుడు విశాఖ వెళ్లి మేం అభివృద్ధి చేస్తామనడం జంధ్యాల, ఈవీవీ, భట్టాచార్య సినిమాలను మించిన కామెడీ చేసినట్టుగా ఉంటుందన్నారు. ఎంతో ఎదిగిన విశాఖ నగరాన్ని మీరు పాడుచెయ్యడం తప్ప అక్కడేమీ జరగదన్నారు. ఎవరేమన్నా విశాఖ వాసుల మనోభావాలను తానే ప్రస్తావిస్తున్నాను అన్నారు. అక్కడి వాళ్లు రౌడీయిజాన్ని ఇష్టపడరని.

ఎంతో ప్రశాంతతను కోరుకునే వ్యక్తులు అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ మీద మీకు చిత్తశుద్ధి ఉంటే కదపడానికి వీల్లేని హైకోర్టును అమరావతిలోనే ఉంచి.. లెజిస్లేచర్ క్యాపిటల్‌ను వెనుకబడిన రాయలసీమలో మీకు ఇష్టమైన ప్రాంతంలో పెట్టండి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *