ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కుమార్తెలు చదువులో తండ్రి పేరు నిలబెడుతున్నారు

సీఎం జగన్ పెద్ద కుమార్తె హర్షిణి రెడ్డికి ప్యారిస్ (ఫ్రాన్స్ రాజధాని)లోని ప్రతిష్టాత్మక ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో సీటు లభించింది.

ముఖ్యమంత్రి జగన్ కుమార్తెలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కుమార్తెలు చదువులో తండ్రి పేరు నిలబెడుతున్నారు. సీఎం జగన్ పెద్ద కుమార్తె హర్షిణి రెడ్డికి పారిస్ (ఫ్రాన్స్ రాజధాని)లోని ప్రతిష్టాత్మక ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో సీటు దక్కింది. ఇంగ్లాండ్‌లోని ప్రతిష్టాత్మక లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన హర్షారెడ్డి.. పారిస్‌ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చదువుకోబోతోంది. దీంతో కుమార్తెను పారిస్ పంపేందుకు మంగళవారం (ఆగస్టు 25) సీఎం జగన్ బెంగుళూరుకు వెళ్లబోతున్నట్లు తెలిసింది. బెంగళూరు నుంచి విమానంలో కుమార్తెను పారిస్ పంపించనున్నారు.

ప్రపంచంలోని టాప్ 5 బిజినెస్‌ స్కూల్స్‌లో ఒకటైన ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో సీఎం జగన్ కుమార్తె సీటు సాధించడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, సీఎం జగన్ చిన్న కుమార్తె వర్షా రెడ్డి అమెరికా ఇండియానా స్టేట్‌లోని ప్రతిష్ఠాత్మక నోట్రే డామ్ యూనివర్శిటీలో అండర్ గ్రాడ్యుయేషన్ చదువుతోంది.

సీఎం జగన్ కుమార్తె హర్షా రెడ్డికి పారిస్‌లోని ప్రతిష్టాత్మక బిజినెస్ స్కూల్లో సీటు రావడంపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. హర్షా రెడ్డి సాధించిన ఘనతకు వారు హర్షం వ్యక్తం చేశారు. తమ అధినేత కుమార్తె పారిస్‌లోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో సీటు దక్కడం గర్వకారణమని పేర్కొంటున్నారు. తండ్రికి తగ్గ కూతుళ్లుగా నిరూపించుకున్నారంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *