ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పెద్ద కుమార్తె హర్షారెడ్డికి ప్రపంచ ప్రఖ్యాత ఇన్సీడ్‌ బిజినెస్‌ స్కూలులో సీటు వచ్చిన సంగతి తెలిసిందే

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పెద్ద కుమార్తె హర్షారెడ్డికి ప్రపంచ ప్రఖ్యాత ఇన్సీడ్‌ బిజినెస్‌ స్కూలులో సీటు వచ్చిన సంగతి తెలిసిందే.. కుమార్తె కోసం దాదాపు ఐదు నెలల తర్వాత ముఖ్యమంత్రి రాష్ట్రం దాటబోతున్నారు.

సీఎం జగన్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన కుమార్తె కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. దాదాపు ఐదు నెలల తర్వాత రాష్ట్రం దాటి వెళుతున్నారు. ఈ నెల 25న బెంగళూరుకు వెళ్లనున్నారు. ఆయన 26న కూడా అక్కడే ఉంటారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పెద్ద కుమార్తె హర్షారెడ్డికి ప్రపంచ ప్రఖ్యాత ఇన్సీడ్‌ బిజినెస్‌ స్కూలులో సీటు వచ్చిన సంగతి తెలిసిందే.. తన కుమార్తెను పారిస్‌కు పంపేందుకు వైఎస్‌ జగన్‌ బెంగళూరుకు వెళుతున్నారు. కరోనా, లాక్‌డౌన్‌తో దాదాపు ఐదు నెలలుగా జగన్ ఏపీని దాటి వెళ్లలేదు. జూన్ 2న ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవాలని అనుకున్నారు. కానీ ఆ భేటీ వాయిదా పడింది. మళ్లీ ఇప్పుడు జగన్ తన కుమార్తె కోసం తొలిసారి రాష్ట్రం దాటనున్నారు.

ప్రపంచంలోని టాప్‌ 5 బిజినెస్‌ స్కూల్స్‌లో ఒకటైన ఇన్సీడ్‌లో సీఎం జగన్ పెద్ద కుమార్తె ‌హర్షారెడ్డికి సీట్ వచ్చింది. ఇప్పటికే లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేయగా.. ఆ తర్వాత అమెరికాకు చెందిన ఎంఎన్‌సీలో ఫైనాన్షియల్‌ కన్సల్టెంట్‌గా ఆఫర్ వచ్చింది.. కానీ దానిని వదులుకుని ఇన్సీడ్‌ బిజినెస్‌ స్కూల్‌లో మాస్టర్స్‌ చేయాలని నిర్ణయించారు. హర్షారెడ్డి చిన్నప్పటి నుంచి రాసిన ప్రతి పరీక్షలోనూ డిస్టింక్షన్‌ సాధించారు. కుమార్తె కోసం దాదాపు ఐదు నెలల తర్వాత ముఖ్యమంత్రి రాష్ట్రం దాటబోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *