తాజాగా శిరోమండనం ఘటనపై సీసీ ఫుటేజ్ కు అడ్డంగా బుక్కైన నూతన్ నాయుడు ఫ్యామిలీ..

తాజాగా శిరోమండనం ఘటనపై సీసీ ఫుటేజ్‌నుపోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా విడుదల చేశారు. ఈ వీడియోలో శ్రీకాంత్‌కు శిరోముండన చేసినట్లు పక్కాగా ఆధారం లభించింది.

విశాఖ శిరోముండన కేసు విశాఖలో కలకలంరేపిన దళిత యువకుడి శిరోముండనం కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. ఎస్సీ ఎస్టీ ఏసీపీ త్రినాథ్ పర్యవేక్షణలో ప్రత్యేక పోలీసు బృందాలు ఈ కేసును దర్యాప్తు చేపట్టాయి. తాజాగా శిరోమండనం ఘటనపై సీసీ ఫుటేజ్‌నుపోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా విడుదల చేశారు. ఈ వీడియోలో శ్రీకాంత్‌కు శిరోముండన చేసినట్లు పక్కాగా ఆధారం లభించింది. ఈ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నామని.. కొంత ఫుటేజ్‌ను తొలగించినట్లు గుర్తించామన్నారు సీపీ.

ఈ కేసులో నూతన్‌ కుమార్‌ నాయుడు భార్య మధుప్రియతో సహా ఏడుగురి (మధుప్రియ, ఇందిరా, ఝాన్సీ , సౌజన్య, రవి, బాలు , వరహాలు)పై సెక్షన్ 307, 342, 324, 323, 506, r/w 34 ipc 3(1)(e).3(2)(v), sc,st, POA act చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. మధుప్రియ సూచన మేరకే ఈ శిరోముండనం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలిందట. దీంతో నూతన్‌ నాయుడు భార్యతో పాటు మిగతావారిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు యువకుడికి శిరోముండనం ఘటనకు వ్యతిరేకంగా దళిత సంఘాల ఆధ్వర్యంలో పెందుర్తి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు.

విశాఖ పెందుర్తిలో బిగ్‌బాస్ కంటెస్టెంట్‌, జనసేన నాయకుడు నూతన్ నాయుడు ఇంట్లో శిరోముండనం చేశారు. నూతన్ ఇంట్లో పనిచేసే కర్రి శ్రీకాంత్‌ అనే యువకుడు.. చెప్పకుండా పని మానేశాడట. దీంతో ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. శుక్రవారం (ఆగస్టు 28) రోజు ఇంట్లో మొబైల్ ఫోన్ పోయిందని శ్రీకాంత్‌ను పిలిపించి నూతన్ నాయుడు కుటుంబ సభ్యులతో పాటు పలువురు దాడిచేశారని.. జుట్టు తొలగించారు. దీంతో అతడు తనకు జరిగిన అన్యాయంపై పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *