చంద్రబాబుపై కేటీఆర్ ఫైర్

హైదరాబాద్ ఐటీ గ్రిడ్స్ కంపెనీ డేటా చోరీ వ్యహారం తెలుగు రాష్ట్రాల్లో కొత్త వివాదాన్ని రాజేసింది. ఈ వివాదంపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం మొదలయ్యింది. ఏపీ సర్కార్ గోప్యంగా ఉంచాల్సిన ప్రజల సమాచారాన్ని ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టిందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తుంటే.. టీ-సర్కారే తమ డేటాను చోరీ చేసిందని ఏపీ సర్కార్ ఎదురు దాడికి దిగింది. ఈ వ్యహారంపై అటు కేటీఆర్.. ఇటు చంద్రబాబు, లోకేష్‌ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్‌లో స్పందించారు. తన ట్వీట్‌లో ‘మీరు ఏ నేరం చేయకపోతే ఈ ఉలికిపాటు ఎందుకు? తెలంగాణ పోలీసుల విధి నిర్వహణకు ఏపి పోలీసుల అడ్డంకులు ఎందుకు? కోర్టులో తప్పుడు పిటిషన్లు ఎందుకు? విచారణ జరిగితే డేటా దొంగతనం బయటపడుతుంది అనే కదా మీ భయం @ncbn గారూ?’అంటూ ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *