ఒక్క సరిగా పడిపోయిన బంగారం ధర..

.
పసిడి వెలవెలబోతోంది.బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా ? అయితే మీకు శుభవార్త. గత కొన్ని రోజులుగా పరుగులు పెడుతూ వచ్చిన బంగారం ధర ఇప్పుడు తగ్గీ ది. కారణం
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర దిగారావడంతో నేరుగా మన మార్కెట్‌లోనూ పసిడి ధరపై ప్రభావం పడుతుంది . గడిచిన వారంలో ఏడేళ్ల గరిష్ట స్థాయి పాకిన బంగారం ధర ఇప్పుడు తగ్గుతూ వచ్చింది. అందువలన భారత్‌లోనూ బంగారం ధరపై ప్రతికూల ప్రభావం పడింది. మనం బంగారాన్ని ఎక్కువగా దిగుమతులద్వారా వస్తుంది . అందువలన అంతర్జాతీయ రేట్లు మన దేశంలో బంగారం ధరను ప్రభావితం చేస్తాయి.
అంతేకాకుండా బంగారం ధరను రూపాయి కూడా ప్రభావితం చేస్తుంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి రికవరీ బాట పట్టడం వలన ధర తగ్గుతూ వచ్చింది. రూపాయి బలపడటం వల్ల బంగారం దిగుమతుల భారం తగ్గుతుంది. దీంతో పసిడి ధర తగ్గుతుంది. ఇంకా ఇన్వెస్టర్లు కరోనా వైరస్ఈ కారణంగా క్విటీ మార్కెట్లలో వచ్చిన నష్టాలనుండి బయాటపడటానికి బంగారాన్ని తెగనమ్మేస్తున్నారు. దీంతో పసిడి ధర భారీగా పతనమైంది.
హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం బంగారం ధర భారీగానే తగ్గింది. ఏకంగా రూ.850 మేర పతనమైంది. దీంతో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.40,000 మార్క్ కిందకు వచ్చేసింది. రూ.40,710 నుంచి రూ.39,860కు క్షీణించింది.
అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. ఇది కూడా ఏకంగా రూ.750 దిగొచ్చింది. దీంతో ధర రూ.44,410 నుంచి రూ.43,660కు క్షీణించింది. ఇకపోతే బంగారం ధర శనివారం కూడా రూ.140 మేర దిగొచ్చిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *