ఏడేళ్ల చిన్నారిని కొడుతూ.. తల్లిదండ్రుల చిత్రహింసలు..

హైదరాబాదులో ఘటన పోలీసుల అదుపులో చిన్నారి పెంపుడు తల్లిదండ్రులు.. ఆశాసింగ్, మణిపాల్ కౌర్
కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిలక్ నగర్‌లో …
        సమాజంలో మానవతా విలువలు రోజురోజుకి తగ్గిపోతున్నాయి. చిన్నారులపై చిత్రహింసలు నేటికీ ఆగడంలేదు. హైదరాబాద్‌ కాచిగూడ పోలీస్టేషన్ పరిధిలోని తిలక్నగర్ లో ఒక చిన్నారిపై జరుగుతున్న అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. పెంపుడు తల్లిదండ్రులు అయినటువంటి ఆశాసింగ్, మణిపాల్ కౌర్ లు తమ ఏడేళ్ల బాలికను ఇష్టమొచ్చినట్లుగా కొడుతూ చిత్ర వధ చేశారు. వాతలు పెట్టిన గాయాలు ఒళ్లంతా కనిపిస్తుండడం విస్మయం కలిగిస్తోంది. ఏడేళ్ల బాలికను పెంపుడు తల్లిదండ్రులు చిత్రహింసలకు గురి చేస్తున్నారన్న సమాచారం బాలల హక్కుల సంఘానికి రావడంతో.. వారు అక్కడికి చేరుకొని చిన్నారిని రక్షించి, ఆశాసింగ్, మణిపాల్ కౌర్ లను అదుపులోకి తీసుకున్నారు. ఆ సంఘం సభ్యులు చైల్డ్ లేబర్ అధికారులకు ఈ విషయాన్ని చేరవేసి, పోలీసుల సహకారంతో చిన్నారికి విముక్తి కలిగించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *