ఇజ్రాయెల్‌లో మహిళలకు రక్షణ లేకుండా పోతోందంటూ వేలాది మంది ఆందోళన చేపట్టారు.

టీనేజర్‌ను హోటల్ గదిలో బంధించి ఒకరి తర్వాత మరొకరు.. ఇలా 30 మంది గ్యాంగ్ రేప్ చేసిన ఘటన ఇజ్రాయెల్‌ను కుదిపేస్తోంది. ఆ టీనేజర్‌కు మద్దతుగా వేలాది మంది మహిళలు ఆందోళన చేపడుతున్నారు.

16 ఏళ్ల టీనేజర్‌ను హోటల్ గదిలో బంధించి.. 30 మంది ఒకరి తర్వాత మరొకరు రేప్ చేసిన ఘటన ఇజ్రాయెల్‌ను కుదిపేస్తోంది. ఈలాత్ నగరం.. ఎర్ర సముద్రం అందాలను చూసేందుకు వెళ్లిన ఆ బాలికపై కామాంధులు కన్నేశారు. రెడ్ సీ రిసార్టులోని ఓ గదిలో ఆమెను బంధించి గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు.

బాలికను బంధించి కోరికలు తీర్చుకుంటున్న విషయం తెలియగానే.. ఆ కామాంధుల స్నేహితులు కూడా వచ్చి ఈ క్రూర ఘటనలో పాలుపంచుకున్నారు. ఈ మృగాళ్లు తమ వంతు వచ్చే వరకు హోటల్ గది బయట క్యూలో నిలబడి మరీ అత్యాచారం చేసినట్లు హోటల్‌లోని సీసీటీవీ ఫుటేజీలను బట్టి అర్థమవుతోంది. ఆగష్టు ఆరంభంలో ఈ దారుణం చోటు చేసుకున్నప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ దారుణ ఘటనను ఖండిస్తూ.. ఇజ్రాయెల్ మహిళలు ఆందోళనకు దిగారు. ‘30 మందికిపైగా’ అంటూ.. దేశంలో ఈ 30 మందే కాదు.. ఎందరో రేపిస్టులు ఉన్నారంటూ.. అత్యాచారాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేస్తున్నారు. ఇజ్రాయెల్‌లో మహిళలకు రక్షణ లేకుండా పోతోందంటూ వేలాది మంది ఆందోళన చేపట్టారు. భారీ సంఖ్యలో మహిళలు తమపై జరిగిన అఘాయిత్యాలపై గళం విప్పుతున్నారు.

ఈ రేప్ ఘటన పట్ల ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్పందించడానికి మాటలు రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవర్నీ వదిలిపెట్టబోం.. దోషులను కఠినంగా శిక్షిస్తాం.. శాంతియుతంగా ఉండాలని నెతన్యాహూ ప్రజలకు పిలుపునిచ్చారు.

బాలికను అత్యాచారం చేస్తున్న సమయంలో కామాంధులు వీడియోలు తీశారు. బాధితురాలి ఫోన్ నుంచి ఓ నిందితుడి ఫోన్‌కు పంపిన సందేశం ఆధారంగా పోలీసులు వీడియోలు తీసినట్లు నిర్ధారణకు వచ్చారు.

తనను 30 మంది రేప్ చేశారని బాలిక ఆరోపిస్తుండగా.. 17 మంది ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని.. వారిలో 13 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. గంటల తరబడి ఈ రేప్ కొనసాగగా..

బాలిక పూర్తి స్పృహలో లేదని పోలీసులు తెలిపారు. అనుమానితుల్లో 13 మంది మైనర్లని పోలీసులు వెల్లడించారు. 13 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అనంతరం పది మందిని మాత్రమే అదుపులో ఉంచుకొని హోటల్ మేనేజర్ సహా మిగతా వాళ్లను వదిలిపెట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *